Mokila Road Accident: అతివేగం వల్లే మొకిలా కారు ప్రమాదం.. వివరాలు వెల్లడించిన ఏసీపీ..
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:47 PM
మొకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై చేవెళ్ల ఏసీపీ కిషన్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మొకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై చేవెళ్ల ఏసీపీ కిషన్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెల్లవారుజామున మీర్జాగూడ వద్ద మొకిలా నుండి రిటర్న్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఐదుగురు ఎకో స్పోర్ట్స్ కారులో ప్రయాణం చేస్తున్నారు. వీరంతా ఒకే కాలేజీలో చదువుతున్న ఫ్రెండ్స్. కారు అతివేగంతో చెట్టును ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగింది. బర్త్ డే సందర్భంగా వైభవ్ హోటల్‌లో డిన్నర్ చేశారు.
ఓ ఫ్రెండ్‌ను డ్రాప్ చేసి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నక్షత్ర అనే అమ్మాయికి చికిత్స జరుగుతోంది. సుమిత్ కారు డ్రైవ్ చేసినట్లు గుర్తించాం. కారు అతి వేగంతో అదుపుతప్పి చెట్టును ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. వారిలో నలుగురు ఐబీఎస్ కాలేజీకి చెందిన వారు కాగా, ఒకరు ఐసీఎప్ఏఐ కాలేజీకి చెందిన వారు.
కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీ చేసుకుని ఫ్రెండ్‌ను డ్రాప్ చేసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నలుగురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. నక్షత్ర అనే అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను కర్గాయల సుమిత్, శ్రీ నిఖిల్, బాల్మూరి రోహిత్, దేవాల సూర్య తేజగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ..
వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు లోకేష్ కీలక సూచనలు