Share News

Tilak Varma surgery: టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ..

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:37 PM

ఆసియా కప్ హీరో, తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం కనబడుతోంది. దీంతో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో తిలక్ ఆడేది అనుమానంగా మారింది.

Tilak Varma surgery: టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ..
Tilak Varma

టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు షాక్. ఆసియా కప్ హీరో, తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం కనబడుతోంది. దీంతో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో తిలక్ ఆడేది అనుమానంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు తిలక్ నాయకత్వం వహిస్తున్నాడు (Tilak Varma surgery update).


ఇటీవల రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్ సమయంలో తిలక్‌కు పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. స్కానింగ్ తీసిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. తిలక్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. తిలక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అతడు కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టొచ్చు. ఈ క్రమంలోనే జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు తిలక్ దూరమయ్యాడు. తిలక్ స్థానంలో ఎవరు ఆడతారనేది ఇంకా వెల్లడి కాలేదు (T20 World Cup injury news).


టీ20 జట్టులో కొద్ది కాలంగా తిలక్ వర్మ కీలక బ్యాటర్‌గా ఉన్నాడు (T20 WC 2026). పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించి ట్రోఫీ అందించాడు. అలాంటి తిలక్ వర్మ కీలక టోర్నీకి ముందు ఇలా అనారోగ్యానికి గురి కావడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. ఒకవేళ టీ20 టోర్నీకి తిలక్‌ను ఎంపిక చేసినా ఆరంభ మ్యాచ్‌ల్లో అతడు ఆడడం కుదరదు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనుంది.


ఇవి కూడా చదవండి..

భారత్‌పై 500 శాతం సుంకాలు.. కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..


ఇది పూర్తిగా స్వదేశీ టెస్లా.. ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

Updated Date - Jan 08 , 2026 | 02:04 PM