500% tariff on India: భారత్‌పై 500 శాతం సుంకాలు.. కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:08 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంపై రిపబ్లికన్ సెనెటర్ లిన్స్ గ్రాహం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ట్రంప్‌తో జరిగిన భేటీలో పలు కీలక విషయాల గురించి చర్చలు జరిపినట్టు తెలిపారు (Trump backs tariff bill).
రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనుందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న దారుణాలకు రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని గ్రాహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా బిల్లు ప్రకారం ఆయా దేశాలపై 500 శాతం సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంటుందని గ్రాహం తెలిపారు (India Russia oil trade).
ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి ఇతర దేశాలు చమురు కొనడం తగ్గుతుందని లిన్స్ గ్రాహం ఆశాభావం వ్యక్తం చేశారు (US sanctions India). రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల్లో ప్రస్తుతం చైనా మొదటి స్థానంలోనూ, భారత్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపించడానికి ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే భారత ఉత్పత్తులపై 50 శాతం సంకాలు విధించారు. అయినా భారత్ మాత్రం రష్యా నుంచి చవకగా వస్తున్న చమురును కొనుగోలు చేస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి రేటు..
కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..