Uttar Pradesh: నిర్లక్ష్యపు డ్రైవింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:20 PM
అతి వేగం.. ప్రమాదానికి మూలం అని వాహనదారులకు ఎంతగా చెప్పినా.. ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఒక ఇన్నోవా డ్రైవర్ నిర్లక్ష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్: మొరాదాబాద్‌లో భయంకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు ఆ వీడియో కనిపిస్తుంది. మొరాదాబాద్ మెయిన్ రోడ్డుపై ఎల్పీజీ ట్యాంకర్, బస్సు, ఒక ఇన్నోవా మూడు వాహనాలు వెళ్తున్నాయి. బస్సు ఎడమ వైపున వస్తున్నట్లు ట్యాంకర్ డ్రైవర్ గమనించినప్పటికీ, కుడి వైపున వస్తున్న ఇన్నోవా సైడ్ మిర్రర్‌లో అతనికి కనిపించలేదు. దీంతో బస్సుకు సైడ్ ఇచ్చేందుకు ట్యాంకర్ ను కుడి వైపునకు తిప్పగా.. కుడి వైపున వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. దీని వల్ల కారు డివైడర్ వైపునకు నెట్టబడింది.
అదృష్టం కొద్ది ఇన్నోవాలో ఉన్నవాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, కారు ముందువైపు బాగా డ్యామేజ్ అయినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో మూడు వాహనాలు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నట్లు గమనించవొచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అతిగా నమ్మకం పెట్టుకొని వాహనాలు నడిపితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. ఓవర్‌టేక్ చేయకండి’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ
సమస్య ఏదైనా నెహ్రూను విమర్శించడం సరికాదు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి