Home » Road Accident
విశాఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెందుర్తి సింహపురి కాలనీ బీఆర్టీఎస్ రోడ్డులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంపై భార్య, కుమారుడితో వెళ్తున్న ఓ వ్యక్తి.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను బలంగా ఢీకొట్టాడు.
గుండెనొప్పి వచ్చిన తన భర్తను రెండు ఆస్పత్రులు తిప్పింది ఆ భార్య. రెండో ఆస్పత్రిలో టెస్ట్ చేసి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. అంబులెన్స్ లేదని చెప్పారు. బైక్ పై బయలుదేరారు. ఇంతలో యాక్సిడెంట్.. రోడ్డు మీద ఆ భార్య..
పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మూడు కార్లు పరస్పరం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు దాటుతున్న తండ్రీకూతుళ్లను కారు ఢీకొన్న ఘటనలో కూతురు చనిపోగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలిని ఎంబీబీఎస్ చదువుతున్న ఐశ్వర్యగా గుర్తించారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాధపురం గ్రామ సమీపంలో అర్ధరాత్రి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు స్థానిక చెర్లోపాలెం, గణపర్తి గ్రామాలకు చెందిన దుర్గ, ధనుష్గా గుర్తించారు.
ఇటీవల కాలంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నా.. ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అనకాపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు తీసుకెళ్తున్న కుమార్తె.. తండ్రి కళ్లముందరే ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా..20మందికి తీవ్ర గాయాలయ్యాయి.