Share News

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

ABN , Publish Date - Feb 07 , 2026 | 08:49 PM

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపం ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం
Patancheru Car accident,

సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధి పోచారం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మౌనిక(36), నవీన్ (30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో హరి ప్రసాద్, హర్ష, అమృత, సుశ్రుతకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరంతా బౌరంపేట సింహపురి కాలనీవాసులుగా గుర్తించారు.


వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను పటాన్ చెరులోని ఓ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఈ వార్తలూ చదవండి:

బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే

ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే.. బీజేజీ ఆరోపణ

Updated Date - Feb 07 , 2026 | 09:11 PM