Home » Revanth Reddy
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్‌కి దిగారని గుర్తుచేశారు కవిత.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రీ ప్రైమరీ విద్యా విధానంలో నవశకానికి నాంది పలికారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది 4,900 బడుల్లో యూకేజీ విద్యను అందించబోతున్నారు..
సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా.. తదితర దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు రేవంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్ పాలిట బ్యాడ్ బ్రదర్స్‌గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మెట్రోరైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాలను 24 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు బండి సంజయ్ .
ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. కాలేజీలను బంద్ చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక విద్యాసంస్థలను నెలకొల్పిందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నిర్ణయాలతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గ్రోత్ ఇంజన్‌గా ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.