Home » Revanth Reddy
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఔషధ తయారీ కంపెనీ ఎలి లిల్లీ.. భారతదేశంలోనే తమ మొట్టమొదటి తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది...
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి చేసేందుకు ఓ లాయర్ యత్నించాడు. కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు.
హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని.. పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందనని అన్నారు. 1965లో ఇందిరా గాంధీ హైదరాబాద్‌కు ఐడీపీఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్‌గా మారిందన్నారు. హైదరాబాద్‌లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయన్నారు.
బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించింది.
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించమంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి పెట్టింది.
విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఘనత దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. నెలకు రూ. 750 కోట్ల ఎరియర్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.