Share News

Tummala Nageswara Rao: ఖమ్మంలో గంజాయి లేకుండా చేస్తా: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:28 AM

గంజాయి బ్యాచ్‌‌లను ఖమ్మంకు దూరం చేయాలని ఎన్నికల సమయంలో ప్రజలు అడిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో గంజాయి కూడా లేకుండా చేస్తా అని స్పష్టం చేశారు.

Tummala Nageswara Rao: ఖమ్మంలో గంజాయి లేకుండా చేస్తా: మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao

ఖమ్మం, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు అడిగినవన్నీ ఇస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. ఈరోజు (గురువారం) ఖమ్మం నగరంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కబ్జా చేసే వాళ్ళని, గొడవలు చేసే వాళ్ళని, గంజాయి బ్యాచ్‌లను ఖమ్మంకు దూరం చేయమని ప్రజలు అడిగినట్లు తెలిపారు. ఖమ్మంలో గంజాయి కూడా లేకుండా చేస్తా అని.. కబ్జాలు కూడా లేకుండా చేస్తానని మాట ఇచ్చానని అన్నారు.


గతంలో కాంగ్రెస్ నాయకుల మీద ఒక్కొక్కరిపై 100 కేసులు పెట్టారని గుర్తుచేవారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరికి అండగా నిలబడతా అని హామీ ఇచ్చారు. స్కూల్స్, కాలేజ్ చుట్టు పక్కల గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు. గంజాయి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తా అని స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలో 5 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని అన్నారు.


నాయకులు వెంట పడి మరీ పనులు చేపించుకోవాలని... లేకపోతే ప్రజలు మొహాలు చూడరన్నారు. ప్రజల మనసులు గెలవాలన్నారు. గంజాయి అమ్మే వాళ్ళని, కబ్జా చేసే వాళ్ళని ఎవరు గెలిపించరని అన్నారు. రాజకీయాలకతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

‘సూపర్ 50 నిర్మాణ్’ మోడల్.. కలెక్టర్లే డ్రైవ్ చేయాలన్న సీఎం

భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 18 , 2025 | 11:34 AM