AP Collectors Conference: ‘సూపర్ 50 నిర్మాణ్’ మోడల్.. కలెక్టర్లే డ్రైవ్ చేయాలన్న సీఎం
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:14 AM
ఏపీ సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలైంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అమరావతి, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆరు జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మొదటగా అల్లూరి జిల్లాలో సూపర్ 50 ఇన్స్పిరేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్ పేరుతో అమలు చేసిన కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజెంట్ చేశారు. పదో తరగతి విద్యార్ధులకు మెంటరింగ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా కలెక్టర్ కార్యాచరణ రూపొందించారు. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్ధులకు టీచింగ్ ఎట్ రైట్ లెవల్ అనే విధానంతో నిర్మాణ్ రూపకల్పన చేశారు. తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు సహా అన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకు 90 వేల మంది విద్యార్ధులకు లబ్ది చేకూరినట్లు కలెక్టర్ వెల్లడించారు.
కొత్త విధానాలు అమలు చేయండి: సీఎం
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. విద్యాశాఖ లాంఛ్ చేసిన ఈ తరహా బెస్ట్ ప్రాక్టీసెస్‌ను జిల్లా కలెక్టర్లే డ్రైవ్ చేయాలని సూచించారు. టెక్నాలజీ ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రజలకు ప్రయోజనం కలిగించాలన్నారు. విద్యాశాఖలో మంచి ట్రాన్సఫర్మేషన్ జరగాలని తెలిపారు. విద్యార్ధులు రాష్ట్రానికి దేశానికి, యావత్ ప్రపంచానికి భవిష్యత్ ఆస్తులని చెప్పుకొచ్చారు. కుప్పంలో విలువల బడి అనే కాన్సెప్టును కూడా ప్రారంభించారని సీఎం అన్నారు. విద్యార్ధులకు విలువలు నేర్పడంతో పాటు క్రీడలు కూడా నేర్పిస్తున్నారన్నారు. నాలెడ్జ్‌తో పాటు విద్యార్ధులకు విలువలు కూడా చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు మరింత ఇంప్రూవ్డ్ మోడల్‌తో ఈ తరహా కొత్త విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు.
కాగా.. అల్లూరి జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్‌పై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాల అమలుపై కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. జాబ్ మేళాల నిర్వహణ, ఉద్యోగ ఉపాధి కల్పనపై సీఎం సమీక్ష చేయనున్నారు. అలాగే రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక సమీక్ష చేపట్టనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ సమీక్షించనున్నారు.
ఇవి కూడా చదవండి...
భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
ప్రభుత్వ భూముల మాయం.. ప్రేక్షకపాత్రలో రిజిస్ట్రేషన్ సిబ్బంది..!
Read Latest AP News And Telugu News