CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
ABN , Publish Date - Dec 17 , 2025 | 07:49 PM
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రూ.10 వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) సదస్సుకు హాజరు కానున్నారు. ఈ విదేశీ పర్యటనకు ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది. 2015లో జరిగిన ఓటుకు నోటు (క్యాష్ ఫర్ వోట్) కేసులో బెయిల్ షరతుల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌పోర్టు కోర్టు కస్టడీలో ఉంది.
రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు ప్రతిసారీ కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో రూ.10 వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దావోస్ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం రేవంత్ ప్రతినిధి బృందంతో కలిసి పాల్గొననున్నారు.
గతేడాది కూడా ఆయన దావోస్‌కు వెళ్లి పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అనుమతితో సీఎం విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగాయి. రాష్ట్ర అభివృద్ధికి ఈ సదస్సు కీలకమవుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News