Share News

SP Balasubrahmanyam Statue: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ వేళ ఉద్రిక్తత.. హౌస్ అరెస్టులు

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:03 PM

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ సోమవారం రవీంద్రభారతిలో జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

SP Balasubrahmanyam Statue: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  విగ్రహావిష్కరణ వేళ ఉద్రిక్తత.. హౌస్ అరెస్టులు
SP Balasubrahmanyam Statue Controversy

హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ (SP Balasubrahmanyam Statue) ఇవాళ(సోమవారం) రవీంద్రభారతిలో జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బాలసుబ్రమణ్యం విగ్రహా ఏర్పాటును తెలంగాణ వాదులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వ్యతిరేకిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తెలంగాణ వాదులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు సిద్ధమైన వారిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రవీంద్ర భారతితో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు పోలీసులు. రవీంద్రభారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహలు ఏర్పాటు చేయాలంటూ పట్టుబట్టారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి నిరాకరించిన బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ ఏర్పాటు చేయొద్దంటూ తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.


కాగా, కొన్ని రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ విషయంపై నటుడు శుభలేఖ సుధాకర్‌తో ఉద్యమకారుడు పృథ్విరాజ్‌తో పాటు మరికొంతమంది వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ చేయడానికి వీలు లేదంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పృథ్విరాజ్‌తో పాటు తెలంగాణ ఉద్యమ కారులను అక్కడ నుంచి పంపించివేశారు. ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ చేయనుండటంతో చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి

హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 01:39 PM