TG News: సీఎం రేవంత్‌తో ఆర్బీఐ గవర్నర్ భేటీ..
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:01 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్‌బీఐ బోర్డ్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు సంజయ్ హైదరాబాద్‌కు వచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్‌బీఐ బోర్డ్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు సంజయ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎంను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను ఆర్‌బీఐ గవర్నర్ కు వివరించారు సీఎం. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు గురించి కూడా ఆర్‌బీఐ గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. కాగా, BUDS యాక్ట్ ను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని ఆర్‌బీఐ గవర్నర్ కోరారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేజ్ (ULI) విషయంలో ఆర్‌బీఐ తీసుకుంటున్న చొరవను సిఎంకు వివరించారు సంజయ్ మల్హోత్రా. ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్స్ క్లెయిమ్ క్యాంపెయినింగ్‌పై సీఎంకు వివరించారు.