Home » Revanth Reddy
విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్‌కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని.. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ఈ విధానం ద్వారా అదానీ కంపెనీలకు అధిక లాభం కలగనుందని బీవీ రాఘవులు ఆరోపించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2కి ఆర్డీ ఆర్ స్టేజ్ 2గా నామకరణం చేస్తూ 24 గంటల్లోగా జీవో ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
నవంబర్ నెల చివరి కల్లా వి హబ్ పనులు ప్రారంభం కావాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలు తీసుకుంది. సాయి సిద్దుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌లో రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పనులు నగర రూపురేఖలను మార్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో తమని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.
ఉత్కంఠ భరితంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం...
హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని స్పష్టం చేశారు.