Telangana: రేవంత్‌పై హరీష్ రావు ఫైర్..
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:14 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించి హరీష్ రావు.. వాదనలో విఫలమైనప్పుడు, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు..
హైదరాబాద్, డిసెంబర్ 24: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించి హరీష్ రావు.. వాదనలో విఫలమైనప్పుడు, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు దివాళాకోరు రాజకీయాలకు మిగిలేది దిక్కుమాలిన వ్యక్తిగత దూషణలు మాత్రమేనని విమర్శించారు. ‘పాలనపై దృష్టి లేనప్పుడు, ఇచ్చిన హామీల అమలుపై ధ్యాస లేనప్పుడు, ప్రతిపక్ష నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిల పడినప్పుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలే. రేవంత్ రెడ్డి రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తున్నది. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరు. 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో ఎక్స్ వేదికగా విమర్శించారు.
మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్..
Also Read:
అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు టెండర్‌పై పిల్.. కొట్టివేసిన హైకోర్ట్..
మీ ప్రతిభను పరీక్షించుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 29 సెకెన్లలో కనిపెట్టండి
తానా సౌత్ ఈస్ట్ ఫుడ్ డ్రైవ్ విజయవంతం