AP High Court: అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు టెండర్‌పై పిల్.. కొట్టివేసిన హైకోర్ట్..
ABN , Publish Date - Dec 24 , 2025 | 08:54 PM
అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు కోసం ఖరారు అయిన టెండర్ పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ పిల్‌ను విచారించిన హైకోర్టు కొట్టేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు కోసం ఖరారు అయిన టెండర్ పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ పిల్‌ను విచారించిన హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ఏడాది తరువాత అందులోని నిబంధనలను సవాల్ చేయడం ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎల్ 1గా నిలిచిన బీఎస్సార్ సంస్థతో పాటు మొత్తం మూడు సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది (Amaravati underground power cable).
ఎల్ 1గా నిలిచిన బీఎస్సార్ ఇన్‌ఫ్రాటెక్‌కు టెండర్ కేటాయిస్తే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరుపున న్యాయవాది మెట్ల చంద్రశేఖర్ వాదించారు. నచ్చిన వారిని ఎంపిక చేసుకునే విధంగా టెండర్ నోటిఫికేషన్‌లో నిబంధనలు పెట్టారని పిటిషనర్ తరుపు న్యాయవాది మెట్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు (High Court dismisses PIL).
పిల్ దాఖలు చేసే ముందు పిటిషనర్ కనీసం అధ్యయనం చేయలేదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు (PIL on Amaravati tender). టెండర్ నిబంధనలపై అభ్యంతరం ఉంటే పాల్గొన్న సంస్థలు కోర్టును ఆశ్రయించాలి కాని, అడ్వకేట్ ముసుగులో పిల్ వేయడానికి వీలులేదని దమ్మాలపాటి వాదించారు. దీంతో హైకోర్టు ఆ పిల్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మొసలికి ఎంత కోపం వచ్చిందో చూడండి.. ఒళ్లు జలధరించే వీడియో..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..