Share News

TANA Food Drive: తానా సౌత్ ఈస్ట్ ఫుడ్ డ్రైవ్ విజయవంతం

ABN , Publish Date - Dec 24 , 2025 | 08:25 PM

తానా (TANA) సౌత్ ఈస్ట్ యువ వాలంటీర్లు జార్జియాలోని కమింగ్‌లో ‘మీల్స్ బై గ్రేస్’ (Meals By Grace) ఫుడ్ బ్యాంక్‌కు మద్దతుగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించింది.

TANA Food Drive: తానా సౌత్ ఈస్ట్ ఫుడ్ డ్రైవ్ విజయవంతం
TANA Food Drive

తానా (TANA) సౌత్ ఈస్ట్ యువ వాలంటీర్లు జార్జియాలోని కమింగ్‌లో ‘మీల్స్ బై గ్రేస్’ (Meals By Grace) ఫుడ్ బ్యాంక్‌కు మద్దతుగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో అంకితభావంతో పాల్గొన్న యువ వాలంటీర్లు స్థానిక డ్రాప్-ఆఫ్ కేంద్రాల ద్వారా 1000 పౌండ్లకు పైగా సిరియల్స్, బియ్యం, టిన్ కూరగాయలు, వంట నూనె, పాస్తా తదితర అవసరమైన ఆహార పదార్థాలను సేకరించి ‘మీల్స్ బై గ్రేస్’ ఫుడ్ బ్యాంక్‌కు విరాళంగా అందించారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు దీప్తి తల్లూరి, నాయకత్వం వహించిన యువ నాయకులకు తానా నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

NRI 2.jpg


ఈ కార్యక్రమంలో మాన్య మహేశ్వరం, గాయత్రి, రామప్రియ మారౌత్, శ్రీహర్ష, రిత్విక్ దేవరపల్లి, వెంకటరామన్ నరసింహన్, లోచన్ కుమార్ గౌడ్ మలిశెట్టి, ఆధ్య పేట, లిషిత మటంశెట్టి, చనస్య పొట్లచెరువు, అవంతిక వాసిరెడ్డి, మనస్విని, సాత్విక్ కందిమల్ల, తన్వి నాయుడు, శ్రీనిధి పెర్లాల, షాన్విక్, అమయ కొర్రపాటి, మోక్ష్ దురెడ్డి, జస్మిత తోట, రాహుల్, కార్తీక్ జొన్నలగడ్డ, సాత్వికేయ, సౌమిల్ ఇషాంక్ సింహ బనాల, యశశ్రీ కరంశెట్టి, ప్రజ్ఞ మారినేని, లోహిత్ అనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ తానా బృందం వాలంటీర్ సర్టిఫికెట్లు అందజేసి వారి కృషిని గౌరవించింది.
NRI 3.jpg


ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులకు మరియు కమ్యూనిటీ సభ్యులకు తానా బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. తానా అట్లాంటా బృందం ఆధ్వర్యంలో, తానా సౌత్ ఈస్ట్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ కొల్లు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈవీపీ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భరత్ మద్దినేని, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లితో పాటు ఆర్థిక అన్నె, పూలని జాస్తి, కోటి కందిమల్ల,
NRI 4.jpg


అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, వినయ్ మద్దినేని, ఉప్పు శ్రీనివాస్, నరేన్ నల్లూరి, చైతన్య కొర్రపాటి, బాలా తదితరులు పాల్గొని తమ మద్దతును అందించారు. సందర్భంగా తానా సౌత్ ఈస్ట్ నాయకులు మాట్లాడుతూఇటువంటి సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేందుకు నిరంతర మార్గదర్శకత్వం,సహకారం అందిస్తున్న తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
NRI 5.jpg

NRI 6.jpg


ఇవి కూడా చదవండి

తగిన శాస్తి జరిగింది.. బైక్‌ స్టంట్ చేసిన యువకుడి పరిస్థితి చివరకు ఏమైందంటే..

పాముతో సింహం పోరాటం.. చివరకు ఆ మృగరాజు పరిస్థితి ఏమైందంటే..

Updated Date - Dec 24 , 2025 | 08:25 PM