Boy bike stunt: తగిన శాస్తి జరిగింది.. బైక్ స్టంట్ చేసిన యువకుడి పరిస్థితి చివరకు ఏమైందంటే..
ABN , Publish Date - Dec 24 , 2025 | 07:33 PM
సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (dangerous bike stunt).
@_Mishraa అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అబ్బాయి రోడ్డుపై తన బైక్‌తో ప్రాణాంతక సాహసాలు చేస్తున్నాడు. భారీ వాహనాలు తిరుగుతున్న బిజీ రోడ్డుపై కట్స్ కొడుతూ బైక్‌ను ఊపేస్తున్నాడు. ట్రక్కుల వెనుక కూడా అలాగే ఫీట్లు చేశాడు. అయితే చివరకు బైక్ బ్యాలెన్స్ కోల్పోయి జారిపడింది. దీంతో ఆ అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు ఆ అబ్బాయి తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరాడు (road stunt gone wrong).
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (viral accident video). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 30 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. తగిన శాస్తి జరిగిందని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి సాహసాలు చేయకండని, జీవితం చాలా విలువైనదని మరొకరు సూచించారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మొసలికి ఎంత కోపం వచ్చిందో చూడండి.. ఒళ్లు జలధరించే వీడియో..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..