Share News

KTR Comments On CM Revanth: సీఎంకు చీమ కుట్టినట్లు కూడా లేదు..

ABN , Publish Date - Dec 24 , 2025 | 07:58 PM

కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఇవాళ గుండె పగిలి మరణించిన జమ్మన్న కుటుంబానికి రూ.25లక్షల పరిహారం అందిచాలని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు..

KTR Comments On CM Revanth: సీఎంకు చీమ కుట్టినట్లు కూడా లేదు..

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించినా సీఎం రేవంత్‌ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. పంట కొనే దిక్కులేక కొనుగోలు కేంద్రం వద్దే జమ్మన్న అనే రైతు గుండెపోటుతో కుప్పకూలి మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కలుకుంట్ల మొక్కజొన్న కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెప్పారు.


నాలుగు రోజులుగా పడిగాపులు పడుతున్నా కూడా మొక్కజొన్న పంట కొనకుండా కాంగ్రెస్ సర్కారు (Congress Govt) అన్నదాత నిండు ప్రాణాన్ని బలితీసుకుందన్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం అందక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరోవైపు భారీ వర్షాలతో పంట నష్టపోయినా కూడా కనీసం పరిహారం అందక కౌలు రైతులు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇంకోవైపు పనికిరాని యాప్‌లతో యూరియా అందక అన్నదాతలు మళ్లీ ఈ సీజన్‌లోనూ అష్టకష్టాలు పడుతున్నారన్నారు.


పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చి.. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన ఈ పాపం ఊరికే పోదని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఇవాళ గుండె పగిలి మరణించిన జమ్మన్న కుటుంబానికి రూ.25లక్షల పరిహారం అందిచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే

తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 24 , 2025 | 08:05 PM