Home » Rayadurg
మండలంలోని డీ కొండాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు వాపోతున్నారు. ప్రతి రోజూ కొళాయి లకు ఐదు లేదా పది నిమిషాలు తాగునీరు వదిలితే ఒక్కొక్క ఇంటికి ఒక బిందె కంటె ఎక్కువ నీరు దొరకడం లేదంటున్నారు.
పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి న 14 మంది విద్యార్థులకు బుధవారం కళ్లీమఠం ము న్సిపల్ హైస్కూల్‌లో ఎస్ ఎంసీ చైర్మన పార్వతి, వైస్ చైౖర్మన డి. సత్యనారాయ ణ సన్మానించారు. పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థుల ఫ్లెక్సీలు వేయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుబ కుల స్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి డిమాండ్లను నెర వేర్చాలని బీసీ కమిషన చైర్మన శ్రీరాజీవ్ రంజనమిశ్రాను కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున కోరారు.
నియోజకవర్గంలో ఈ ఏడాది రబీసీజనలో 1.15 లక్షల ఎకరాల దాకా సాగునీటితో రైతులు వరిపంట సాగుచేశారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అధిక ది గుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం మండలంలోని కలుగోడు గ్రామంలో బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించారు.
పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మ యూరవాహనంపై శ్రీవా రు భక్తుల కు దర్శనమి చ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను సా యంత్రం మయూర వా హనంపై కొలువుదీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్ మీదు గా నేసేపేట వరకు ఊరేగించారు.
నియోజకవర్గంలో రూ. 17 కోట్ల వ్యయంతో గ్రామీణ, అంతర్ రాష్ట్ర రహదారుల మరమ్మతు పను లు చేపట్టామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. మండల కేంద్రంలో శనివారం రూ. 6కోట్లతో చేపట్టిన గుండ్లపల్లి- బళ్లారి జాతీయ రహదారి మరమ్మతు పనులకు ఆయన భూమి పూజ చేశారు.
పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవా రం శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయా న్నే మొలకాల్మూరు రోడ్డులో భక్తిశ్రద్ధలతో హోమాన్ని నిర్వహించి మడుగు తేరును లాగారు.
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయాన్నే స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవచధారణ తదితర పూజలు నిర్వ హించారు.
పట్టణంలోని ప్రసిద్ధిగాం చిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవా రు హనుమద్ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శ నమిచ్చారు. శ్రీదేవి, భూదే వి సమేవత వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం హనుమద్ వాహనంపై అధిష్టించారు.