MLA: రోడ్డు రవాణా వ్యవస్థను పటిష్ట పరుస్తున్నాం
ABN , Publish Date - May 09 , 2026 | 11:20 PM
నియోజకవర్గంలో రూ. 17 కోట్ల వ్యయంతో గ్రామీణ, అంతర్ రాష్ట్ర రహదారుల మరమ్మతు పను లు చేపట్టామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. మండల కేంద్రంలో శనివారం రూ. 6కోట్లతో చేపట్టిన గుండ్లపల్లి- బళ్లారి జాతీయ రహదారి మరమ్మతు పనులకు ఆయన భూమి పూజ చేశారు.
- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
బొమ్మనహాళ్, మే 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రూ. 17 కోట్ల వ్యయంతో గ్రామీణ, అంతర్ రాష్ట్ర రహదారుల మరమ్మతు పను లు చేపట్టామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. మండల కేంద్రంలో శనివారం రూ. 6కోట్లతో చేపట్టిన గుండ్లపల్లి- బళ్లారి జాతీయ రహదారి మరమ్మతు పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఐదేళ్ల వైసీపీ హ యాంలో అధ్వానంగా మారిన రహదారులను బాగు చేస్తున్నామన్నారు. రాష్ట్ర రవాణా మంత్రి జనార్దన రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ల మేరకు మరిన్ని పనులు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. బొ మ్మనహాళ్ నుంచి 11.8 కిలో మీటర్ల రోడ్డును పటిష్టం చేస్తామని, ఏడు మీటర్లు వెడల్పుతో పనులు జరుగుతాయిని ఈఈ రాజ్‌గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ రవి శంకర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన హనుమంతరెడ్డి, నాయకులు తిమ్మరాజు, కేశవరెడి, కొత్తపల్లి మల్లికార్జున, నాగరాజ్, అనిల్, నవీన, హనుమంత, మహేంద్ర, మల్లన్న, నాగరాజుస్వామి, కావలిరాము, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం
గ్రామీణ ప్రాంతల ప్రజల సమస్యలను ఎప్పటిక ప్పుడు తెలుసుకు ని, పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బొమ్మనహాళ్ మండలంలోని కురువళ్లి గ్రా మంలో శనివారం ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుం చి ఆర్జీలను స్వీకారించారు. ఆర్డీవో వసంతబాబు, తహసీల్దార్ మునివే లు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటరమణ, ఎంఈవో మల్లికార్జున, హౌసింగ్ ఏఈఈ వాసంతి, ఏపీవో లక్ష్మీకాంతబాయి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....