Share News

గజవాహనంపై ఊరేగిన శ్రీవారు

ABN , Publish Date - May 07 , 2026 | 12:03 AM

పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయాన్నే స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవచధారణ తదితర పూజలు నిర్వ హించారు.

గజవాహనంపై ఊరేగిన శ్రీవారు

రాయదుర్గం రూరల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయాన్నే స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవచధారణ తదితర పూజలు నిర్వ హించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై ఉంచి దేవాలయం వద్ద నుంచి వినాయ కసర్కిల్‌ మీదుగా లక్ష్మీబజార్‌ వరకు ఘనంగా ఊరేగించారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, శ్రీవైష్ణవ, వీరశైవ లింగాయత సంఘా ఆధ్వర్యంలో ఊరేగింపు ఘనంగా సాగింది.

నేడు రథోత్సవం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ఈవో నరసింహా రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 07 , 2026 | 07:08 AM