MLA: బీటీపీ సాగునీటితో ఆశాజనకంగా వరి
ABN , Publish Date - May 10 , 2026 | 11:46 PM
నియోజకవర్గంలో ఈ ఏడాది రబీసీజనలో 1.15 లక్షల ఎకరాల దాకా సాగునీటితో రైతులు వరిపంట సాగుచేశారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అధిక ది గుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం మండలంలోని కలుగోడు గ్రామంలో బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించారు.
- ప్రభుత్వ విప్ కాలవ ఫ పంట పొలాల పరిశీలన
గుమ్మఘట్ట, మే 10(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఈ ఏడాది రబీసీజనలో 1.15 లక్షల ఎకరాల దాకా సాగునీటితో రైతులు వరిపంట సాగుచేశారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అధిక ది గుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం మండలంలోని కలుగోడు గ్రామంలో బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతు లతో మాట్లాడి పంటల దిగుబడిపై ఆరా తీశారు. రైతు కరిబసప్ప 50 బస్తాల నుంచి 60 బస్తాల దాకా ఎకరాకు దిగుబడి వస్తుందన్నారు. అంతేగాకుండా పంటలకు పురుగుమందులు పిచికారి చేసే అవసరం రాలేదని సంతోషం వ్యక్తం చేశారు. పురుగులమందులు పిచికారి చేయక పోవడం వల్ల తమ పంటలకు మంచి డిమాండ్ ఉందని రైతులు వెల ్లడించారు. ప్రభుత్వ గిట్టుబాటు ధర కన్నా ఎక్కువకు కొనుగోలు చేసేం దుకు మిల్లర్లు సైతం ఇష్టపడుతున్నారని వెల్లడించారు. ఏది ఏమైనా ఈ ప్రాంతం రైతులు సకాలంలో మంచి పంటలు పండించుకుని సుభిక్షంగా ఉంటున్నారని, ఇది తమ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు ఆకాంక్ష అని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన హనుమంతరెడ్డి, వైస్ చైర్మన మిద్దింటి దానవేంద్ర, బీటీ ప్రాజెక్టు చైర్మన కాలవ రాజు, టీడీపీ మండల కన్వీనర్ కాలవ సన్నన్న, మాజీ కన్వీనర్ గిరిమల్లప్ప, బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ శ్రీరాములు, సింగల్ విండో అధ్యక్షుడు నీరగంటి తిమ్మప్ప, ఇరిగేషన డీఈ గీతాలక్ష్మి, వ్యవసాయ అధికారి నిర్మల్‌కుమార్, ఆంజనే యులు, పలువురు రైతులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....