Share News

GOD: శ్రీవారిని అశ్వవాహనంపై ఊరేస్తున్న భక్తులు

ABN , Publish Date - May 08 , 2026 | 11:39 PM

పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవా రం శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

GOD: శ్రీవారిని అశ్వవాహనంపై ఊరేస్తున్న భక్తులు

అశ్వవాహనంపై దర్శనమిచ్చిన వెంకటరమణుడు

రాయదుర్గం రూరల్‌, మే 8(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవా రం శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తులను సాయంత్రం అశ్వవాహనంపై కొలువు దీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్‌ మీదుగా లక్ష్మీబజార్‌ వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా రెడ్డి, ఆర్య కటిక, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు ఊరేగింపులో పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 08 , 2026 | 11:39 PM