Share News

WATER: తాగునీటి ఎద్దడి

ABN , Publish Date - May 14 , 2026 | 12:06 AM

మండలంలోని డీ కొండాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు వాపోతున్నారు. ప్రతి రోజూ కొళాయి లకు ఐదు లేదా పది నిమిషాలు తాగునీరు వదిలితే ఒక్కొక్క ఇంటికి ఒక బిందె కంటె ఎక్కువ నీరు దొరకడం లేదంటున్నారు.

WATER: తాగునీటి ఎద్దడి
Villagers gathered at the tap for drinking water

రాయదుర్గం రూరల్‌, మే 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని డీ కొండాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు వాపోతున్నారు. ప్రతి రోజూ కొళాయి లకు ఐదు లేదా పది నిమిషాలు తాగునీరు వదిలితే ఒక్కొక్క ఇంటికి ఒక బిందె కంటె ఎక్కువ నీరు దొరకడం లేదంటున్నారు. అదే విధంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నీరు గత కొద్దిరోజుల నుంచి రాకపోవడంతో గ్రామంలో తాగునీటి కోసం కష్టాలు ఏర్పడిన ట్లు తెలిపారు.


గ్రామంలో తాగునీటికి సంబంధించిన గ్రామ పంచా యతీ మోటార్లు ఉన్నప్పటికీ వేసవికాలం కావడంతో భూగర్భజలా లు తగ్గిపోవడంతో తాగునీరు తక్కువగా వస్తున్నట్లు వారు పేర్కొ న్నారు. ప్రతినిత్యం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తాగునీరు అందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

వజ్రకరూరు(ఉరవకొండ): వజ్రకరూరుర మండలపరిధిలోని కొనకొండ్ల గ్రామంలో తాగునీటి కోసం మహిళలు ఆందోళన చేపట్టారు. ఉరవకొండ- గుంతక ల్లు ప్రధాన రహదారిపై బుధవారం వారు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. పది రోజులుగా నీళ్లు రాకపోతే తాము ఏమి తాగాలని వాపోయారు. రహదారిపై బైఠాయించ డంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగస్వామి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. రెండ్రోజుల్లోగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 14 , 2026 | 12:06 AM