కన్నుల పండువగా రథోత్సవం
ABN , Publish Date - May 07 , 2026 | 11:26 PM
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయా న్నే మొలకాల్మూరు రోడ్డులో భక్తిశ్రద్ధలతో హోమాన్ని నిర్వహించి మడుగు తేరును లాగారు.
రాయదుర్గం, మే 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయాన్నే మొలకాల్మూరు రోడ్డులో భక్తి శ్రద్ధలతో హోమాన్ని నిర్వహించి మడుగు తేరును లాగారు. వేదపండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించి సంప్రదాయం అనుసరించి గోవిందనామస్మరణతో రథోత్సవ కార్యక్రమాలను సాగించారు. సాయంత్రం మొలకాల్మూరు రోడ్డు వద్ద నుం చి ప్రారంభమైన రథోత్సవం వినాయకసర్కిల్, బళ్లారిరోడ్డు, శాంతినగర్ వరకు సాగింది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నా రు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజినల్ చైర్మన పూల నాగరాజు, టీడీపీ నాయకులు పాల్గొని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి భక్తులతో కిటకిట లాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటి సౌకర్యంతో పాటు మజ్జిగ సరఫరా చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.