Home » Rayadurg
సైకో జగన ఐదేళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి, నయవంచనకు గురిచేశార ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పట్టణంలో గురువారం నిర్వహించిన దళితచైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎనఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేట్ ఽమీటింగ్ నిర్వహించినట్లు ఎనఎంయూఏ డిపో కార్యదర్శి తిప్పే స్వామి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద బుధవారం నిరస న చేపట్టారు.
మండలంలోని ఆర్‌బీ వంక, మల్లాపురం, పల్లేపల్లి తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కురవడంతో పంట కుంటలు, చెక్‌డ్యాంలలో నీరు చేరి కళకళలాడాయి.
డి. హీరేహాళ్ మండలంలోని దొడగట్ట గ్రామ ఆంబేడ్కర్ కాలనీ వాసులు నాలుగు రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. పట్టణంలోని జయంతి రాధాకృష్ణయ్యశెట్టి కల్యాణ మం డంపంలో ఈ నెల 22వ తేదీన చేపట్టే ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
మండలంలోని కర్ణాటక సరిహద్ధులో ఉన్న గో విందవాడ గ్రామంలో నాసిరకం పురుగుమం దుల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ఓ ఫర్టిలై జర్ దుకాణంలో సెకండ్ సేల్ పేరుతో బయో కంపెనీలకు చెందిన పురుగుమందులను కర్ణాట క రాష్ట్రంలోని కంప్లి, కురుగోడు, గంగావతి ప్రాంతాల నుంచి అక్రమంగా దిగమతి చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతిపౌరుడు పారిశుధ్య కార్మికుడిగా బా ధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పట్ట ణంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పాత మున్సిపాలిటీ వద్ద ఆయన ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ బడుగు, బ లహీన వర్గాల పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ పెద్ద పీట ఉంటుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని గోవిందవాడ గ్రామంలో గురు వారం నిర్వహించిన టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు.
మండలంలోని డీ కొండాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు వాపోతున్నారు. ప్రతి రోజూ కొళాయి లకు ఐదు లేదా పది నిమిషాలు తాగునీరు వదిలితే ఒక్కొక్క ఇంటికి ఒక బిందె కంటె ఎక్కువ నీరు దొరకడం లేదంటున్నారు.
పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి న 14 మంది విద్యార్థులకు బుధవారం కళ్లీమఠం ము న్సిపల్ హైస్కూల్‌లో ఎస్ ఎంసీ చైర్మన పార్వతి, వైస్ చైౖర్మన డి. సత్యనారాయ ణ సన్మానించారు. పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థుల ఫ్లెక్సీలు వేయించారు.