WATER: తాగునీటికి కటకట
ABN , Publish Date - May 19 , 2026 | 11:43 PM
డి. హీరేహాళ్ మండలంలోని దొడగట్ట గ్రామ ఆంబేడ్కర్ కాలనీ వాసులు నాలుగు రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
డి. హీరేహాళ్(బొమ్మనహాళ్), మే 19(ఆంధ్రజ్యోతి): డి. హీరేహాళ్ మండలంలోని దొడగట్ట గ్రామ ఆంబేడ్కర్ కాలనీ వాసులు నాలుగు రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆ కాలనీ వాసులు వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే వ్యవసాయ బోర్లకు కరెంట్ సరఫరా అయినప్పుడు అక్కడికి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఉదయం పె ద్దలు పనులకు వెళితే చిన్నారులు బిందెలు తీసుకోని వ్యవసాయ తోటల వద్ద ఉన్న బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. మోటారు కాలి పో యిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకో వ డం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తాగునీటి సమస్య రోజురో జుకూ తీవ్రంగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండి పడు తున్నారు. ఇప్పటికైనా అధికారులు మోటారుకు మరమ్మతులు చేసి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....