Share News

MLA: దళితులను వంచన చేసిన జగన

ABN , Publish Date - May 21 , 2026 | 11:49 PM

సైకో జగన ఐదేళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి, నయవంచనకు గురిచేశార ని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పట్టణంలో గురువారం నిర్వహించిన దళితచైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు.

MLA: దళితులను వంచన చేసిన జగన
MLA Kalava conducting the rally

- వైసీపీ రాజకీయ కుట్రల్లో పావులు కావద్దు : కాలవ

రాయదుర్గం, మే 21(ఆంధ్రజ్యోతి): సైకో జగన ఐదేళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి, నయవంచనకు గురిచేశార ని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పట్టణంలో గురువారం నిర్వహించిన దళితచైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల జగన పాలనలో దళితులపై అనేక దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తీవ్రస్థాయి లో విమర్శించారు. డాక్టర్‌ సుధాకర్‌, సుబ్రహ్మణ్యం వంటి వారి ఘట నలను ప్రజలకు గుర్తు చేసి, అప్పట్లో దళితులపై జరిగిన అన్యాయాల ను వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దళిత చైతన్యయాత్ర లను నిర్వహిస్తోందన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిబద్ధతో పని చేస్తోంద న్నారు. నియోజ కవర్గంలో ఒక దళిత యువకుడు హత్యకు గురైన ఘ టనలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలిచిందని తెలిపారు. ఆ కుటుంబసభ్యుడికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని వెల్లడించారు. దళితవాడల్లో మౌళిక సదుపాయాలతో పాటు ప్రతి ఇంటికి ఉచిత సోలార్‌ విద్యుత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దళి తుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కూటమిప్రభుత్వానికి అండగా నిలవాలని, వైసీపీ రాజకీయ కుట్రలకు పావులు కావద్దని దళిత సమాజానికి ఎమ్మెల్యే సూచించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 21 , 2026 | 11:49 PM