MLA: స్వచ్ఛతకు ప్రతిరూపంగా ‘దుర్గాన్ని’ మారుద్దాం
ABN , Publish Date - May 16 , 2026 | 11:56 PM
పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతిపౌరుడు పారిశుధ్య కార్మికుడిగా బా ధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పట్ట ణంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పాత మున్సిపాలిటీ వద్ద ఆయన ప్రారంభించారు.
రాయదుర్గం, మే 16(ఆంధ్ర జ్యోతి): పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతిపౌరుడు పారిశుధ్య కార్మికుడిగా బా ధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పట్ట ణంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పాత మున్సిపాలిటీ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 400 మంది పారిశుధ్య కార్యక్ర మాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అయితే ఆ కొంతమందే పని చేస్తే సరిపోదని, ప్రతి పౌరుడూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దాదాపు రూ. 57 లక్షలు వెచ్చించామని, ఇందులో భాగంగా చెత్త సేకర ణ బండ్ల సంఖ్య పెంచామని, కొత్తగా రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేశా మని, పారిశుధ్య కార్మికులకు అవసరమైన పనిముట్లు అందించామని తెలిపారు. రాయదుర్గాన్ని సుందరమైన, స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....