Share News

ALUMNI: ఆత్మీయ సమావేశం

ABN , Publish Date - May 25 , 2026 | 12:10 AM

మండలంలోని మాల్యం ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తరువాత ఆదివారం ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు చదువులు చెప్పిన ఆనాటి ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్‌, ప్రణవానంద, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, హరికృష్ణ, అమరవాణి, లక్ష్మీదేవి తదితరులను సన్మానించారు.

ALUMNI: ఆత్మీయ సమావేశం
Alumni with then teachers in Mallyam

కణేకల్లు, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాల్యం ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తరువాత ఆదివారం ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు చదువులు చెప్పిన ఆనాటి ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్‌, ప్రణవానంద, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, హరికృష్ణ, అమరవాణి, లక్ష్మీదేవి తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రవి, కాశీనాథ్‌రెడ్డి, వనజాక్షి, శశి, సుకన్య, పరమేశ్వర్‌రెడ్డి, కేశవరెడ్డి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కుందుర్పి: మండలంలోని అపిలేపల్లి ఎంపీయూపీఎస్‌ పాఠశా లలో 2004-05 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి చదివిన 65 మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీసీ తిమ్మప్ప అధ్యక్షతన జరిగి న


ఈ సమావేశంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు వరదరాజులు, సర్దార్‌ బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో ప్రాథమికోన్నత పాఠశాల ఇనచార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు బి, బొమ్మయ్య, మాజీ సర్పంచ అతావుల్లా, డీలర్‌ విరుపాక్షి, విద్యాకమిటీ చైర్మనలు మారుతి, అనురాధ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఉరవకొండ: పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో 1990-1992లో ఇంటర్మీడియట్‌ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. 37 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు అం తా ఒక్కచోట కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి అధ్యాపకులు చలమారెడ్డి, సలాం, బయపు రెడ్డి. ఇమామ్‌వలి, సత్యవతిని సన్మానించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 25 , 2026 | 12:11 AM