FAKE: జోరుగా నకిలీ వ్యాపారం
ABN , Publish Date - May 18 , 2026 | 11:39 PM
మండలంలోని కర్ణాటక సరిహద్ధులో ఉన్న గో విందవాడ గ్రామంలో నాసిరకం పురుగుమం దుల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ఓ ఫర్టిలై జర్ దుకాణంలో సెకండ్ సేల్ పేరుతో బయో కంపెనీలకు చెందిన పురుగుమందులను కర్ణాట క రాష్ట్రంలోని కంప్లి, కురుగోడు, గంగావతి ప్రాంతాల నుంచి అక్రమంగా దిగమతి చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
- తక్కువ ధర పేరుతో రైతులకు అంటగడుతున్న వైనం
బొమ్మనహాళ్, మే 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్ణాటక సరిహద్ధులో ఉన్న గో విందవాడ గ్రామంలో నాసిరకం పురుగుమం దుల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ఓ ఫర్టిలై జర్ దుకాణంలో సెకండ్ సేల్ పేరుతో బయో కంపెనీలకు చెందిన పురుగుమందులను కర్ణాట క రాష్ట్రంలోని కంప్లి, కురుగోడు, గంగావతి ప్రాంతాల నుంచి అక్రమంగా దిగమతి చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తక్కు వ ధరకే మందులు లభిస్తున్నాయన్న ఆశతో మిరప, పత్తి రైతులు ఈ మందులను కొనుగోలు చేసి, పం టలకు పిచికారి చేస్తున్నారు. అయితే ఆశించిన ఫలితం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు కొందరు రైతులు వాపోతున్నారు. కొన్ని మందులపై సరైన బిల్లులు, లేబుళ్లు లేకుండా విక్రయిస్తున్నారన్న ఆరోప ణలు ఉన్నాయి. పురుగుమందులు వాడిని తర్వాత పంటల్లో పురుగులు నివారణ కాకపోవడంతో పాటు, కొ న్ని చోట్ల పంటలు ఎండిపో తున్నాయని రైతులు అంటున్నారు.
సరిహ ద్దు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని నాసిరకం పురుగుమందుల వ్యాపారం సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతు న్నాయి. రైతుల ప్రాణాలతో చెలగాటమాడు తున్న ఇలాంటి దుకాణాలపై వెంటనే దాడులు నిర్వహించి, నాణ్యత పరీక్షలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి వస్తున్న మందులపై పూర్తి స్థాయి లో విచారణ జరిపి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై బొమ్మన హాళ్ వ్యవసాయాధికారి సాయికుమార్‌ను వివరణ కోరగా... కర్ణాటక ప్రాంతాలకు చెందిన పురుగుమందులు, ఎరు వులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలో ప్రతి నెలా దుకాణల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నకిలీ మం దుల గురించి రైతులు తన దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామరు. గోవిందవాడలో తనిఖీలు నిర్వహించామని, మరోసారి తనిఖీచేసి వాస్త వాలు బయటకొస్తే వారి దుకాణం లైసెన్స రద్దు చేస్తామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....