Share News

MLA: కష్టపడే వారికి టీడీపీలో పెద్దపీట

ABN , Publish Date - May 14 , 2026 | 11:49 PM

తెలుగుదేశం పార్టీ బడుగు, బ లహీన వర్గాల పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ పెద్ద పీట ఉంటుందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని గోవిందవాడ గ్రామంలో గురు వారం నిర్వహించిన టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు.

MLA: కష్టపడే వారికి టీడీపీలో పెద్దపీట
Kalava Srinivas taking oath with Mandal Committee members

- ఎంపీ అంబికా, ప్రభుత్వ విప్‌ కాలవ

బొమ్మనహాళ్‌, మే 14(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బడుగు, బ లహీన వర్గాల పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ పెద్ద పీట ఉంటుందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని గోవిందవాడ గ్రామంలో గురు వారం నిర్వహించిన టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. టీడీపీ మండల కన్వీనర్‌గా ఎంఆర్సీ మ ల్లన్న. ఉపాధ్యక్షుడిగా మల్లికార్జున, ప్రధాన కార్యదర్శిగా మల్లీడు శ్రీని వాసులును నియమించి, ప్రమాణ స్వీకారం చేయించారు. బీటీ ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మన కేశవరెడ్డి, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ ల్లికార్జున, నాయకులు చంద్రహాస్‌, బలరాంరెడ్డి, కొత్తపల్లి తిమ్మరాజు, పయ్యావుల అనిల్‌, మహేంద్ర, సోమనాథ్‌ గౌడ్‌, ముల్లంగి నారాయణ స్వామి, అప్పారావు, రాతింటి వన్నూరుస్వామి, కేశప్ప, వన్నూ రుస్వామి, నటరాజ్‌, కావలి రాము, సాల్లాపురం బాబు, సుంకన్న, జి వన్నూరుస్వామి, బంగి లోకేష్‌, లేపాక్షి, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 14 , 2026 | 11:49 PM