MLA: సమన్వయంతో పనిచేయండి
ABN , Publish Date - May 25 , 2026 | 11:48 PM
పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్, విద్యుతశాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆయన సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో మున్సి పల్, విద్యుతశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- తాగునీటి సరఫరాకు ఇబ్బందుల్లేకుండా చూడండి
- అధికారులకు ఎమ్మెల్యే కాలవ సూచన
రాయదుర్గం, మే25(ఆంధ్ర జ్యోతి): పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్, విద్యుతశాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆయన సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో మున్సి పల్, విద్యుతశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కణేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో తగినంత నీరు ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు ఐదురోజులకు ఒక సారి కూడా నీరు సరఫరా చేయలేకపో వడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత సరఫరాలో తర చూ అంతరాయాలు ఏర్పడటం వల్ల నీటి పంపింగ్‌లో సమస్యలు వస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి వివరించారు. ప్రస్తు తం టీ వీరాపురం సబ్‌స్టేషన నుంచి కణేకల్లు ఎస్ ఎస్ ట్యాంక్ పం పింగ్ స్టేషన వరకు సుమారు 15 కి.మీ. మేర విద్యుత సరఫరాలో తర చూ సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యుతశాఖ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కణేకల్లు సబ్ స్టేషన నుంచే ఎస్‌ఎస్ ట్యాంక్ పంపింగ్ స్టేషనకు నేరుగా విద్యుత స రఫరా చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సుమారు రూ. 30 లక్షలకుపైగా వ్యయం అవుతుందని, అవసరమైన పనులకు అ నుమతులు తీసుకుని త్వరలో ప్రారంభిస్తామని ఎస్‌ఈ తెలిపారు. అలాగే రాయదుర్గం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రాయదుర్గం సబ్‌స్టేషన నుంచే విద్యుత సరఫరా అందిస్తే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న పింగాణి ఇన్సులేటర్ల స్థానంలో పాలిమర్ ఇన్సులేటర్లు అమర్చాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ పనులను 15 రోజుల్లో పూర్తి చేస్తామని విద్యుతశాఖ ఈఈ చక్రవర్తి తెలిపారు. ఈ వారంలో రాయదుర్గం పట్టణ తాగునీటి పథకానికి వి ద్యుత సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మున్సిపల్, విద్యుతశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....