Share News

MLA: ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ABN , Publish Date - May 18 , 2026 | 11:43 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. పట్టణంలోని జయంతి రాధాకృష్ణయ్యశెట్టి కల్యాణ మం డంపంలో ఈ నెల 22వ తేదీన చేపట్టే ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

MLA: ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
Reviewing MLA Kalava

- ఎమ్మెల్యే కాలవ - ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

రాయదుర్గం, మే 18(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. పట్టణంలోని జయంతి రాధాకృష్ణయ్యశెట్టి కల్యాణ మం డంపంలో ఈ నెల 22వ తేదీన చేపట్టే ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పట్టణం లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సోమవారం నియోజకవర్గ పరిధిలోని ఎంఈవోలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మె ల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సా హించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.


నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 550 కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించనున్న ట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రతి ఉన్నత పాఠశా లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వివిధ సబ్జెక్టుల్లో 100 శా తం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులను గౌరవిస్తామన్నారు. నియో జకవర్గ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాలవ ఫౌండేషన ఆధ్వర్యంలో ఇంటర్మీడియేట్‌ విద్యను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సన్మాన గ్రహీతలకు శాలువ, మెమోంటోతో పాటు విద్యార్థులకు, కళాశాలకు ఉపయోగపడే బ్యాగుల ను అందజేస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం ప్రైవేట్‌, కార్పొ రేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చే ర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిప్యూటీ డీఈవో లక్ష్మన్న్ణ, ఐదు మండలాల ఎంఈవో, హెచఎంలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 18 , 2026 | 11:43 PM