Share News

NMU: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - May 20 , 2026 | 11:50 PM

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎనఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేట్‌ ఽమీటింగ్‌ నిర్వహించినట్లు ఎనఎంయూఏ డిపో కార్యదర్శి తిప్పే స్వామి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద బుధవారం నిరస న చేపట్టారు.

 NMU: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
NMU leaders conducting gate meeting in Rayadurgam

- ఎనఎంయూ గేట్‌ మీటింగ్‌

రాయదుర్గం రూరల్‌, మే 20(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎనఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేట్‌ ఽమీటింగ్‌ నిర్వహించినట్లు ఎనఎంయూఏ డిపో కార్యదర్శి తిప్పే స్వామి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద బుధవారం నిరస న చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసిస్టెంట్‌ సెక్రెటరీ ఎస్‌ నాగరాజు, డిపో కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ ఎలెకి్ట్రక్‌ బస్సులను ప్రభు త్వం ద్వారా కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల వివిధ సమస్యలను వెంటనే పరిష్కరి చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్‌ నాయకులు ఎం సిద్దేశ్వర్లు, రవినాయక్‌, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

గుంతకల్లు టౌన/ గుత్తి: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్క రించాలంటూ స్ధానిక డిపో వద్ద బుధవారం ఎనఎంయూ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వ హించారు. ఎనఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ ఎర్రి స్వామి, జోనల్‌ సహాయ కార్యదర్శి విజయలక్ష్మి, రీజనల్‌ కమిటీ సభ్యు లు నాగసుధ, డిపో కమిటీ చైర్మన ఎం నాగరాజు, డిపో కార్యదర్శి నటరాజ్‌, అధ్యక్షుడు మల్లికార్జున, గ్యారేజ్‌ అధ్యక్షుడు మోహినుద్దీన, నాయకులు సుంకన్న, రహంతుల్లా, ఖలీల్‌, రాము, తదితరులు పాల్గొన్నారు.


అదేవిధంగా ఎనఎంయూ ఆధ్వర్యంలో గుత్తి డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఎనఎంయూ డిపో అధ్యక్షుడు అంజి, గ్యారేజ్‌ సెక్రెటరీ శ్రీనివాసుల గౌడ్‌, వర్కింగ్‌ అధ్యక్షుడు బాబు, నాయకులు గోపాల్‌, శర్మస్‌, లోకేష్‌, సుంకన్న, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

ఉరవకొండ: ఎలకి్ట్రక్‌ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి , ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని ఎనఎంయూ నాయకులు నారా యణ స్వామి డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గేట్‌మీట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎనఎంయూ నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 20 , 2026 | 11:50 PM