Home » Rayadurg
మండలంలోని వడ్రవన్నూరు గేట్ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్, భాస్కర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.
అధికారుల మధ్య సమన్వ య లోపంతో రైతులకు చెందిన జొన్నల లారీల లోడు గోడౌన గేటు వద్దే నిలిపేశారు. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్ధేహాళ్ సహకార సం ఘం జొన్నల కొనుగోలు కేంద్రం నుంచి గుంతకల్లు గోడౌనకు తరలించి న రెండు లారీల జొన్నలను అనలోడ్ చేసుకోకపోవడంతో రైతులు, రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.
మండల కేంద్రంలోని యూ నియన బ్యాంక్‌కు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం పంట రుణాల రెన్యువల్స్ జరుగుతుండగా బ్యాంక్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిం దని ఈ సందర్భంగా రైతులు తెలిపారు.
పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 16.10 కోట్ల ఫింఛన మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తామన్న ప్ర భుత్వ హామీ మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరుగారుతోంది. ఇం టింటీకీ వెళ్లి పింఛన పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాగునీటి సమస్య మీ ఇం టిదై.. తాగునీరు రావడం లేదని మీ ఇంట్లో వాళ్లు నిలదీస్తే.,.. ఇలాగే ఉంటారా..? అని మున్సిపల్, విద్యుత శాఖ అధికారుల ను ఎమ్మెల్యే కా లవ శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతి థిగృహంలో శనివారం ఆయన ఇరుశాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు.
స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవ త్సరం చదువుతున్న ఎన సీసీ క్యాడెట్ ఎస్ సమీర్ జమ్మూ కశ్మీర్ లోజవహర్ ఇనస్టిట్యూట్ ఆఫ్ మౌం టెనీరింగ్, వింటర్ స్పోర్ట్స్ వారు నిర్వహించిన మౌం టెన ట్రిక్కింగ్ క్యాంప్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచి నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివా సులు గురువారం పేర్కొ న్నారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలే సరైన వేదికలని బొమ్మన హాళ్ ఎంఈవో మల్లికార్జున అన్నారు. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
కణేకల్లు నుంచి రాయదుర్గం పట్టణానికి తాగునీటని సరఫరా చేసే పైప్‌లైన లీక్ అవుతోంది. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.
మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం విప్రమలై విశిష్టాద్వైత విశ్వశాంతి ఆశ్రమంలో లక్ష్మీనారాయణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు.