Share News

PENSION: ఇంటి వద్దకే పింఛన ఇలాగేనా?

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:48 PM

సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తామన్న ప్ర భుత్వ హామీ మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరుగారుతోంది. ఇం టింటీకీ వెళ్లి పింఛన పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

PENSION: ఇంటి వద్దకే పింఛన ఇలాగేనా?
Elderly people at Dodagatta Panchayat office

- రెండు గ్రామాల్లో కార్యాలయం వద్ద, చెట్టు కింద పంపిణీ

డి. హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌), జూన 1(ఆంధ్రజ్యోతి): సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తామన్న ప్ర భుత్వ హామీ మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరుగారుతోంది. ఇం టింటీకీ వెళ్లి పింఛన పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డి. హీరేహాళ్‌ మండలంలోని దొడగట్ట గ్రామంలో సోమవారం పింఛన కోసం వృద్ధులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా హోసగుడ్డ గ్రామంలో అధికారులు చెట్టు నీడన, కట్టపై లబ్ధిదారులను ఒకేచోట చేర్చి పంపిణీ చేశా రు. ఇంటింటికీ పెన్షన పంపి ణీ ప్రక్రియపై అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉన్పప్ప టికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వం ఉద్ధేశించిన విధంగా ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకే పింఛన అం దేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- ఈ విషయంపై డి.హీరేహాళ్‌ ఎంపీడీవో దాసనాయక్‌ను వివరణ కోరగా సోమవారం సర్వర్‌ మొరాయించిందని తెలిపారు. అందుకే కొన్ని చోట్ల సర్వర్‌ కనెక్ట్‌ కాలేదన్నారు. దీంతో పలు గ్రామాల్లో సర్వర్‌ కనెక్షన వచ్చే చోట పంపిణీ చేసి ఉంటారని తెలిపారు. దొడగట్ట గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన కోసం లబ్ధిదారులు వేచి ఉన్న విషయంపై సంబంధిత సిబ్బందికి మెమోలు ఇచ్చి చర్యలు తీసుకుం టామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 01 , 2026 | 11:48 PM