MLA: పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:52 PM
పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 16.10 కోట్ల ఫింఛన మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
- ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, జూన 1(ఆంధ్ర జ్యోతి): పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 16.10 కోట్ల ఫింఛన మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని 32వ వార్డులో సోమవారం ఆయన సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ భర్తను కోల్పోయి కిడ్నీ వ్యాధితో బాధపడు తున్న ఓ వితంతువుకు ప్రభుత్వం రూ. 10 వేల పింఛన అందజేస్తోందని తెలిపారు. టీడీపీ వార్డు ఇనచార్జ్ రావుత రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు బండి క్రిష్ణమూర్తి, పద్మశాలి డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన గాజుల వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....