ACCIDENT: ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:12 AM
మండలంలోని వడ్రవన్నూరు గేట్ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్, భాస్కర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.
-ఇద్దరికి గాయాలు - వారిలో ఒకరి పరిస్థితి విషమం
రాయదుర్గం రూరల్, జూన 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని వడ్రవన్నూరు గేట్ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్, భాస్కర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. వడ్రవ న్నూరుకు చెందిన విజయ్, భాస్కర్ స్థానిక చెరువులో మట్టిని ట్రాక్టర్ లో లోడ్ చేసుకుని గ్రామ సమీ పంలోని రైతు పొలంలో అనలోడ్ చే శారు. ట్రాక్టర్‌ను జాతీయ రహదారి పక్కన నిలబెట్టా రు. వారు అందు లోనే ఉన్నారు. రాయదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న లారీ ఆ ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ ఇం జిన రెండు భాగాలుగా చీలింది. గాయపడిన ఇద్దరిని రాయదుర్గం ప్ర భుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం అనంతరం విజయ్ పరిస్థితి విషమించడంతో పాటు వారిద్దరిని అనంతపురం ప్రభుత్వాసు పత్రికి తరలించారు. విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అర్బన సీఐ జయనాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్‌పై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...