MLA: సమస్య మీదైతే ఇలానే ఉంటారా?
ABN , Publish Date - May 31 , 2026 | 12:57 AM
తాగునీటి సమస్య మీ ఇం టిదై.. తాగునీరు రావడం లేదని మీ ఇంట్లో వాళ్లు నిలదీస్తే.,.. ఇలాగే ఉంటారా..? అని మున్సిపల్, విద్యుత శాఖ అధికారుల ను ఎమ్మెల్యే కా లవ శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతి థిగృహంలో శనివారం ఆయన ఇరుశాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు.
- మున్సిపల్, విద్యుత అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
- పట్టణంలో తాగునీటి సమస్యపై సమీక్ష
రాయదుర్గం, మే 30(ఆంధ్రజ్యోతి): తాగునీటి సమస్య మీ ఇం టిదై.. తాగునీరు రావడం లేదని మీ ఇంట్లో వాళ్లు నిలదీస్తే.,.. ఇలాగే ఉంటారా..? అని మున్సిపల్, విద్యుత శాఖ అధికారుల ను ఎమ్మెల్యే కా లవ శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతి థిగృహంలో శనివారం ఆయన ఇరుశాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై అసంతృప్తి వ్య క్తం చేశారు. తాగునీరు అందించడంలో ఇరు శాఖల వైఫల్యాన్ని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. మున్సిపాలిటీ, విద్యుత శాఖల మధ్య సమన్వ యం పూర్తిగా లోపించిందన్నారు. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపు తున్నారని మండిపడ్డారు. ప్రజలకు రోజు మార్చి రోజు లేదా కనీసం మూడురోజులకు ఒక సారి తాగునీరు తప్పక ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఏడెనిమిది రోజులకోసారి కూడా నీరు ఇవ్వలేకపోవడం దుర దృష్టకరమన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేదన్నారు. ఇది ప్రజల సమస్య కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం జీతం కోసం పని చేయడం సరికాదన్నారు. ప్రజల్లో తనకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికే మీరంతా పనిచేస్తున్నట్లు అనిపిస్తోం దన్నారు. బాధ్యత రాహిత్య ధోరణిని వెంటనే మార్చుకుని, ప్రజల స మస్యను తమ సమస్యగా భావించి పనిచేయాలని సూచించారు. ఇకపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. సోమవారం నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాం తాలను సందర్శిస్తానని తెలిపారు. ఇకపై సమన్వయ లోపం, నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల ముందు నిలబెట్టడం, క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేయడం తప్ప మరొక మార్గం ఉండదని హెచ్చరించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....