MEO: ప్రభుత్వ బడులే భవితకు బాటలు
ABN , Publish Date - May 28 , 2026 | 12:07 AM
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలే సరైన వేదికలని బొమ్మన హాళ్ ఎంఈవో మల్లికార్జున అన్నారు. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
బొమ్మనహాళ్/యాడికి, మే 27(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలే సరైన వేదికలని బొమ్మన హాళ్ ఎంఈవో మల్లికార్జున అన్నారు. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా యాడికి ఎంఈవో కాశప్ప, ఎంపీడీవో వీరరాజు తదితరులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై యాడికిలో బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎంఈవో-2 సీతారామాంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....