LEAKAGE: తాగునీటి సరఫరాలో అంతరాయం
ABN , Publish Date - May 26 , 2026 | 11:54 PM
కణేకల్లు నుంచి రాయదుర్గం పట్టణానికి తాగునీటని సరఫరా చేసే పైప్‌లైన లీక్ అవుతోంది. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.
రాయదుర్గం రూరల్, మే 26(ఆంధ్రజ్యోతి): కణేకల్లు నుంచి రాయదుర్గం పట్టణానికి తాగునీటని సరఫరా చేసే పైప్‌లైన లీక్ అవుతోంది. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. రాయదుర్గం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే పైప్ లైన కొంతానపల్లి వద్ద లీక్ అవ్వడంతో మరమ్మతులు చేపడుతు న్నామన్నారు. మరమ్మతులు పూర్తి అయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. అప్పటిదాకా ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....