GOD: ఘనంగా లక్ష్మీనారాయణ హోమం
ABN , Publish Date - May 25 , 2026 | 11:51 PM
మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం విప్రమలై విశిష్టాద్వైత విశ్వశాంతి ఆశ్రమంలో లక్ష్మీనారాయణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
రాయదుర్గం రూరల్, మే 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం విప్రమలై విశిష్టాద్వైత విశ్వశాంతి ఆశ్రమంలో లక్ష్మీనారాయణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుటు శ్రీరామ్మూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు హరిప్రసాద్ భరద్వాజ్ విష్ణు స్వా ముల ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ హోమం చేశారు. గతంలో నిర్వహించిన చతుః షష్టి లక్ష్మీ నారాయణ దీక్షాయజ్ఞం అనంతరం మిగిలి ఉన్న కరుణ హోమాన్ని నిర్వహించామని వారు తెలిపారు. మహా పూర్ణాహుతి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....