FARMERS: బ్యాంకుకు తాళం వేసి నిరసన
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:46 PM
మండల కేంద్రంలోని యూ నియన బ్యాంక్‌కు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం పంట రుణాల రెన్యువల్స్ జరుగుతుండగా బ్యాంక్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిం దని ఈ సందర్భంగా రైతులు తెలిపారు.
కణేకల్లు, జూన 2(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని యూ నియన బ్యాంక్‌కు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం పంట రుణాల రెన్యువల్స్ జరుగుతుండగా బ్యాంక్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిం దని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు అనేకసార్లు బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సిబ్బంది నియామకం జరుగలేదన్నారు. దీంతో రైతు సంఘం అధ్యక్షు డు జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తాళం వేసి బ్యాంక్ ముందు ఆందోళన చేపట్టారు. స్థానిక బ్యాంక్ మేనేజర్ వారి వద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...