Share News

LORRY: అలాట్‌మెంట్‌ లేదని అనలోడ్‌ నిరాకరణ

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:49 PM

అధికారుల మధ్య సమన్వ య లోపంతో రైతులకు చెందిన జొన్నల లారీల లోడు గోడౌన గేటు వద్దే నిలిపేశారు. బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్ధేహాళ్‌ సహకార సం ఘం జొన్నల కొనుగోలు కేంద్రం నుంచి గుంతకల్లు గోడౌనకు తరలించి న రెండు లారీల జొన్నలను అనలోడ్‌ చేసుకోకపోవడంతో రైతులు, రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

LORRY: అలాట్‌మెంట్‌ లేదని అనలోడ్‌ నిరాకరణ
A lorry stopped at Guntakallu Godauna

- గుంతకల్లు గోడౌన గేటు వద్దే ఆగిన జొన్నల లారీలు

బొమ్మనహాళ్‌, జూన 2(ఆంధ్రజ్యోతి): అధికారుల మధ్య సమన్వ య లోపంతో రైతులకు చెందిన జొన్నల లారీల లోడు గోడౌన గేటు వద్దే నిలిపేశారు. బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్ధేహాళ్‌ సహకార సం ఘం జొన్నల కొనుగోలు కేంద్రం నుంచి గుంతకల్లు గోడౌనకు తరలించి న రెండు లారీల జొన్నలను అనలోడ్‌ చేసుకోకపోవడంతో రైతులు, రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మండలం నుంచి ఐదుగురు రైతులకు చెందిన 40 టన్నుల జొన్నలను సోమవారం రెండు లారీల్లో లోడ్‌ చేసి గుంతకల్లుకు తరలించా రు. అయితే ఆనలోడ్‌కు అనుమతి లేదంటూ అ క్కడి గోడౌన వద్దే ఆ లారీలను నిలిపివేశారు. సి విల్‌ సప్లై అధికారుల నుంచి అలాట్‌మెంట్‌ రాలే దని అందుకే అనలోడ్‌ చేసుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.


జొన్నల లోడ్‌లు గోడన వద్దే నిలిచిపోవడంతో రవాణా ఖర్చులు పెరగడమే కా కుండా ధాన్యం భద్రతపైనా రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలో చిన్నపాటి నిర్లక్ష్యమే రైతులకు తలనొప్పిగా మా రిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత గోదాములకు తరలించే విషయంలో సం బంధిత శాఖల సమన్వయంతో వ్యవహరించాల్సి ఉండగా అలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శస్తున్నారు. వెంటనే సమస్యను పరి ష్కరించి జొన్నల లోడ్‌లను అనలోడ్‌ చేయాలని నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విష యంపై ఉద్ధేహాళ్‌ సోసైటీ సీఈవో హనుమంతును వివరణ కోరగా సోమవారం వెళ్లిన రెండులారీలను గుంతకల్లులో గోడౌన వద్ద అపేశారని తెలిపారు. ఈ విషయాన్ని సివిల్‌ సప్లై అధికారుల దృష్టికి తీసుకె ళ్లామని, అలాట్‌మెంటుపై చర్చిస్తున్నామన్నారు. రైతు లకు ఇబ్బందులు కలుగకుండా అనలోడు చేసుకో వాలని సివిల్‌ సప్లై అధికారులను కోరామన్నారు. అలాట్‌మెంటు మేరకు జొన్నలు తరలించామని ఆయన తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 02 , 2026 | 11:49 PM