Home » Rayadurg
మండల కేం ద్రంలోని తనకు చెందిన దా నిమ్మ తోటకు శుక్రవారం రా త్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని టీడీపీ నాయ కుడు విజయ్‌శెట్టి వాపోయా రు. దీంతో మూడు ఎకరా ల్లోని 1200 దానిమ్మ చెట్లు, డ్రిప్ వైర్లు, పైపులైన్లు మొ త్తం కాలి బూడిద అయ్యా యని తెలిపారు.
మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శనివారం విశేష పూజలు చేశారు. ప్రధాన ఆర్చకులు అనిల్‌కుమార్ చార్యులు స్వామికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వెండి కవచ అలంకరణ, విశేషపుష్పా లం కరణ చేశారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు.
నేర విభాగంపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ట్రైనీ ఎస్పీ, ఐపీఎస్ అధికారి అశ్విన మణిదీప్ పోలీసుల కు సూచించారు. ఆయన గురువారం పట్ట ణంలోని యూపీఎస్ పోలీస్‌స్టేషనను కళ్యాణ దుర్గం డీఎస్పీ రవిబాబుతో కలిసి తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషనలోని రికార్డులను పరిశీ లించారు.
గ్రామీణ ప్రాం తాలలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుతస్తంభాలు పెచ్చులూడి, కడ్డీలు తేలి, ప్రమాదకరంగా మారాయి. అయినా విద్యుత అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదని మండలపరిధిలోని జుంజురంపల్లికి చెంది న పలు కాలనీవాసులు వాపోతున్నారు.
స్థానిక తహసీల్దార్ కార్యా లయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అదేవి ధంగా సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజలకు నిరాశ ఎదుర వుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని తహసీల్దార్, ఆర్‌ఐకి కలెక్టర్ నుంచి అదేశాలతో వారు అక్కడికి వెళ్తున్నారు.
ప్రభుత్వం విద్యార్థుల సౌక ర్యార్థం కోట్ల రూపాయలు ఖ ర్చు పెడుతున్నా, అందు కో సం క్షేత్ర స్థాయిలో చేసిన ప నులు అర్ధాంతరంగా ఆగిపోవ డంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మం డలం లోని తొమ్మిది పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
పట్టణంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు కేటాయించిన నిధులపై వైసీపీ డీసెంట్ నోటీసు ను సమర్పించి రూ. 3 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంది. స్థానిక ము న్సిపల్ కౌన్సిల్ హాల్‌లో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్‌పర్సన పొరాళు శిల్ప అధ్యక్షతన నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ గోవింద రాజులు అజెండాలోని 5వ అంశంగా ఉన్న రూ. 3 కోట్ల అభివృద్ధి పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉన్నత పాఠశాల దశ లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విద్యార్థులకు సూచిం చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల మైదా నంలో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు.
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు ప్రస్తుతం మరమ్మతులకు చేరుకున్నాయి. దిష్టిబబొమ్మలా దర్శనమిస్తున్నా యి. పట్టణంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఒకటో తరగ తి నుంచి తొమ్మిదో తరగతి వరకు 325 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు.