ROAD: పల్లె పండుగ 2.0 జోరు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:30 PM
గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మం డలం లోని తొమ్మిది పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
- రూ 1.9 కోట్లతో 22 సీసీ రోడ్ల పనులు
బొమ్మనహాళ్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మం డలం లోని తొమ్మిది పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ. 1.9 కోట్ల వ్యయంతో మొత్తం 22 రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి. దీంతో గ్రామాల రూపురేఖలు మారుతాయని పలువు రు అంటున్నారు. మండల కేంద్రమైన బొమ్మనహాళ్‌తో పాటు మండ లంలోని శ్రీధరఘట్ట, ఉద్ధేహాళ్, దేవగిరి, దర్గాహొన్నూరు, ఉంతకల్లు, ఉప్పరహాళ్, నేమకల్లు గ్రామాల్లో రోడ్ల పనులు జరుగుతున్నాయి. మట్టి దారుల స్థానంలో పక్కా రోడ్లు నిర్మిస్తుండడంతో రాకపోకలు సులభమ వుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేసున్నారు. ఇప్పటి వరకు వర్షం పడితే గ్రామం నుంచి బయటకు రావడం కష్టమయ్యేది. ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తుండటంతో సమస్యలు తగ్గుతాయని స్థానికులు అంటున్నారు. పల్లె పండుగా 2.0 కార్యక్ర మం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తుండడం, పనులు వేగంగా సాగుతుండడం కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. నాణ్యత ప్రమాణలతో పనులు జరుగుతున్నాయని నిర్ణీత, గడువులో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పంచాయతీరాజ్ ఇనచార్జి జేఈఈ శ్రీధర్ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....