Share News

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:44 PM

మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శనివారం విశేష పూజలు చేశారు. ప్రధాన ఆర్చకులు అనిల్‌కుమార్‌ చార్యులు స్వామికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వెండి కవచ అలంకరణ, విశేషపుష్పా లం కరణ చేశారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు.

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు
Trainee SP Manideep performing puja to the Lord

- స్వామిని దర్శించుకున్న ట్రైనీ ఎస్పీ

బొమ్మనహాళ్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శనివారం విశేష పూజలు చేశారు. ప్రధాన ఆర్చకులు అనిల్‌కుమార్‌ చార్యులు స్వామికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వెండి కవచ అలంకరణ, విశేషపుష్పా లం కరణ చేశారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు. ట్రైనీ ఎస్పీ అస్విన మణిదీప్‌, కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామికి పూజలు జరిపించారు. అనంతరం ఆయన బొమ్మన హాళ్‌ పోలీస్‌ స్టేషనను సందర్శించారు. పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ... మండలానికి ఉన్న కర్ణాటక సరిహద్దులో అను మానాస్పద వక్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. ఆయన శనివారం స్థానిక పోలీస్‌ స్టేషనను సందర్శించిన సందర్భంగా పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటర మణ, బొమ్మనహాళ్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 07 , 2026 | 11:44 PM