Share News

POLE: ప్రమాదకరంగా విద్యుత స్తంభాలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:42 PM

గ్రామీణ ప్రాం తాలలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుతస్తంభాలు పెచ్చులూడి, కడ్డీలు తేలి, ప్రమాదకరంగా మారాయి. అయినా విద్యుత అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదని మండలపరిధిలోని జుంజురంపల్లికి చెంది న పలు కాలనీవాసులు వాపోతున్నారు.

POLE: ప్రమాదకరంగా విద్యుత స్తంభాలు
The pillar in BC Colony is like this...

- పెచ్చులూడి, కడ్డీలు కనిపిస్తున్న వైనం

- పట్టించుకోని విద్యుత శాఖాధికారులు

రాయదుర్గం రూరల్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాం తాలలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుతస్తంభాలు పెచ్చులూడి, కడ్డీలు తేలి, ప్రమాదకరంగా మారాయి. అయినా విద్యుత అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదని మండలపరిధిలోని జుంజురంపల్లికి చెంది న పలు కాలనీవాసులు వాపోతున్నారు. చాలా రోజుల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత స్తంభాలు పెచ్చులూడి, కడ్డీలు తేలడంతో పాటు ఈ దురుగాలులు వచ్చిన పుడు అటు ఇటు ఊగినపుడు వైర్లు ఒకదాని కొకటి తగులు తున్నా యి. ఆ సమయంలో వైర్ల నుంచి మంటలు వస్తున్నాయని, దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగు తుందోననే భయాందోళనతోనే కాలం వెళ్లదీస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారు. వర్షం వచ్చినపుడు ఆ పాత స్తంభాలు అర్త్‌ రావడంతో ప్రమాదాలు జరిగిన సంఘటను ఉన్నాయని వారు చెబు తున్నారు. జుంజురంపల్లి ఎస్సీకాలనీలో మైలార లింగేశ్వరస్వామి ఆలయం వద్ద, బీసీ కాలనీలోని జెండాకట్ట వద్ద విద్యుతస్తంభాలు ఇలా ప్రమాదకరంగా మారాయని తెలుపు తున్నారు.


దీనికి తోడు జెండాకట్ట వద్ద విద్యుతస్తంభానికి తక్కువ ఎత్తులోనే విద్యుత ట్రాన్స ఫార్మర్‌ బుడ్డీలు ఏర్పాటు చేశారని, దీంతో స్థానికులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నట్లు తెలిపారు. పాత విద్యుతస్థంభాల స్థానంలో కొత్తవి కేటాయించారని, అయితే పాత వాటిని తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయడంలో విద్యుత సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత విద్యుత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై ట్రాన్సకో ఏఈ బాలచంద్రను వివరణ కోరగా... త్వరలో పాత విద్యుతస్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 03 , 2026 | 11:42 PM